క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ 'శాకుంతలం' అనే కొత్త సినిమా తీయబోతున్నారు. అయితే కథానాయిక విషయంలోనే ఆయనకు చిక్కులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా భారం మోసే కథనాయిక ప్రస్తుతానికి తెలుగులో అనుష్క ఒక్కరే కనిపిస్తున్నారు. కానీ అనుష్క ఈ సినిమాకు నో చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బల్క్ డేట్లు ఇవ్వడం అంటే కష్టమని, అందులోనూ తాను కొంత వెయిట్ పెరిగానని, అందుకే శాకుంతలం చేయలేనని చెప్పారట అనుష్క.