తన పెళ్లి వేడుకలను నిరాడంబరంగా ప్లాన్ చేశారు కాజల్ అగర్వాల్. అక్టోబర్ 30న కాజల్, గౌతమ్ కిచ్లు వివాహం జరగనుంది. ఫంక్షన్ హాలు, స్టార్ హోటల్లో కాకుండా పెళ్లి వేదికకు తన ఇల్లు బెస్ట్ అనుకున్నారట కాజల్. ఇటీవలే ఇంటిని రీమోడలింగ్ చేయించారట. 20 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి వేడుకలు జరగనున్నాయని తెలిసింది.