తమిళంలో హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ‘వరుడు’ సినిమాలో విలన్ గా నటించాడు ఆర్య. ఇప్పుడు మరోసారి అతడు విలన్ పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వినోద్ కుమార్ ఓ సినిమాను నిర్మించబోతున్నారు.ఇందులో హీరోగా విశాల్ నటిస్తుండగా.. అతడితో తలపడే విలన్ గా ఆర్య కనిపిస్తారట. సినిమాలో ఆర్య పాత్ర హీరో రేంజ్ కి ఎంతమాత్రం తగ్గకుండా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. గతంలో విశాల్-ఆర్య కలిసి ‘వాడు వీడు’ అనే సినిమాలో నటించారు. మళ్లీ ఇంతకాలానికి వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు.