‘సంచాలక్’గా నువ్వు కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తోంది అంటూ సోహైల్ ముఖం మీదే అనేశాడు అవినాష్. సంచాలక్‌గా నిర్ణయాలు నా ఇష్టం అని సోహైల్ అన్నాడు. దానికి అవినాష్ ‘పొద్దున్నుంచి గేమ్స్ ఆడుతున్నాం పిచ్చొళ్లమా’ అంటూ సమాధానమిచ్చాడు. నన్ను సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అన్నారు. ఇది కాదా సేఫ్ గేమ్ అంటూ అరిచేశాడు. ఒకరిని సపోర్టు చేసుకుంటూ, ఇంకొకరిని సపోర్టు చేయడం లేదు అని అవినాష్ విసురుగా అన్నాడు. మామూలుగానే కోపం ఎక్కువగా వచ్చే సోహైల్… చాలాసేపు కంట్రోల్ చేసుకున్నాడు. అఖిల్ వచ్చి సర్దిచెప్పి వాష్ రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ కుర్చీకి కోపంతో ఓ పంచ్ ఇచ్చాడు సోహైల్. ఆ తర్వాత ‘నా తప్పు లేకపోయినా ఎవరేమన్నా నేను పడుతున్నా’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అన్నం తినేటప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. నా తప్పు లేకపోయినా నన్ను చాలా మాటలు అంటున్నారు అని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక అఖిల్, మెహబూబ్ సోహెల్ ని ఓదార్చారు. అవినాష్ వచ్చి సారీ చెబుతూ మాట్లాడడానికి వస్తే సోహెల్ నిరాకరించాడు.