చిరంజీవిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కరోనా భయం కాస్త తగ్గుముఖం పట్టినవేళ, చిరంజీవి తిరిగి సినిమా షూటింగ్ లకు రెడీ అవుతానని చెప్పగానే.. ఇంట్లోవాళ్లు మాత్రం ససేమిరా అని చెప్పేశారట. ఆచార్య సినిమా నిర్మాత, చిరు తనయుడు రామ్ చరణ్ కూడా కొన్నిరోజుల తర్వాతే సినిమా షూటింగ్ కి వెళ్దామని అన్నారు. అయితే చిరంజీవి మాత్రం వీరిని ఎలాగైనా ఒప్పించి సెట్ లోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.