బిగ్బాస్ రియాల్టీ షో సీజన్-4 లో ఐదో వారం వచ్చే సరికి బిగ్బాస్ ఇంటి నుంచి సుజాత బయటకు వచ్చేసింది. ప్రధానంగా ఆమె బయటికి రావడానికి ఆమె నవ్వుతో పాటు హోస్ట్ నాగార్జునను బిట్టు అని పిలవడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుజాత తన ఎలిమినేషన్ గురించి నాగార్జున దగ్గర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆమె పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్ బాస్ లో బిట్టూ వ్యవహారాన్ని బైటపెట్టింది.