సుశాంత్ సింగ్ సోదరి శ్వేతాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి పూర్తిగా ఆమె తప్పుకున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్ నుంచి తప్పించుకునేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఆమె తొలగించారు. సుశాంత్ ఆత్మహత్య జరిగి అక్టోబర్14కు నాలుగు నెలలైన సందర్భంగా "నిజమైన ప్రేరణ" అంటూ ఒక వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఇదే సమయంలో ఆమె సడెన్‌గా తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది.