తారక్ పేరు కోలీవుడ్‌లో మారుమ్రోగిపోతోందట. దీనికి కారణం కోలీవుడ్‌లో 'వీరం', 'వేదాళం' వంటి సూపర్ హిట్ చిత్రాలతో బడా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ అనే టాక్ నడుస్తోంది.శౌర్యం'తో దర్శకుడిగా పరిచమైన శివ.. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలు తీసి సక్సెస్ కాలేక కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు.   అక్కడ విక్రమార్కుడు రీమేక్ 'సిరుత్తై'తో హిట్ అందుకుని.. ఆ తర్వాత అజిత్‌తో ఎన్నో మూవీలు చేశాడు. ఇప్పుడు రజినీకాంత్‌తో 'అన్నాత్తె' తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత శివ.. ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. కోలీవుడ్ హీరోలందరూ ఆయనతో సినిమా చేయాలని చూస్తుంటే.. శివ మాత్రం తారక్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట.