చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో చిరంజీవి కోసం మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..ఈ సినిమాను అన్ని విధాలా గొప్పగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు కొరటాల.అందులో భాగంగానే సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేత వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నారని టాక్ నడుస్తోంది.  వాస్తవానికి చిరు అంటే మహేష్‌కు ప్రత్యేక అభిమానం. ఇక అటు కొరటాలతోనూ మహేష్‌కు మంచి రిలేషన్ ఉంది. ఈ సాన్నిహిత్యంతోనే కొరటాల మహేష్‌ను వాయిస్ ఓవర్ ఇవ్వమని కోరారని, అందుకు మహేష్ సైతం ఓకే చెప్పారని అంటున్నారు.