బిగ్ బాస్ 4 ఈ వారం నామినేషన్లో ఉన్న 9 మందిలో ఐదుగురు అమ్మాయిలే ఉన్నారు. అంటే ఇక్కడా వాళ్లదే ప్రాధాన్యత. అయితే ఇది ఎవరూ కోరుకోని ప్రాధాన్యత. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ సారి కూడా అమ్మాయే ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అలా అయితే ఆనవాయితీ కొనసాగిస్తారా? అనేది చూడాలి. ఈ వారం నామినేషన్లో ఉన్న ఆరియానా, మోనాల్, దివి, లాస్య, హారికలో ఎవరో ఒకరు వెళ్లిపోతారని సమాచారం. ఒకవేళ అమ్మాయి కాకపోతే కుమార్ సాయి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. చూద్దాం ఈసారి ఆనవాయితీ సాగుతుందా లేదో.