తమిళ దర్శకుడు మోహన్ రాజా.. యూవీ క్రియేషన్స్ వారికి ఓ కథ వినిపించాడట. అది నచ్చడంతో చరణ్ వద్దకు ఇతన్ని పంపారట. ఈ కథలో పాన్ ఇండియా ఎలిమెంట్స్ ఉండడంతో చరణ్ ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. గతంలో ఈ దర్శకుడు తమిళంలో తెరకెక్కించిన ‘తనీ ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో ‘ధృవ’ పేరుతో చరణ్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా ఆ చిత్రం మంచి విజయం సాధించింది.