రేణుదేశాయ్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా స్థాయిలో ‘ఆద్య’ అనే సినిమా తెరకెక్కబోతోంది. దసరా రోజు పవన్ కల్యాణ్ చేతుల మీదగా ఈ సినిమా మొదలు పెట్టాలనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ తో మాట్లాడారని, ఆయన కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. ఒకవేళ నేరుగా సెట్ లోకి రాకపోయినా.. జూమ్ యాప్ ద్వారా అయినా సరే ఆయన క్లాప్ కొడతారని, అదే తమ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు.