లాస్య.. భర్త మంజునాథ్ గురించి చెబుతూ… ‘‘తొలుత మా నాన్నకు మా ఆయన నచ్చలేదు. కానీ ఇప్పుడు మా ఆయన్ని కొడుకులా అనుకుంటున్నాడు’’ అని ఆనందంగా చెప్పింది లాస్య. తర్వాత కెమెరాతో మాట్లాడుతూ భర్తకు సారీ చెప్పింది. ‘‘మాకు పెళ్లైనా ఏడేళ్లవరకు నా భర్తకు ఐడెంటిటీ ఇవ్వలేదు. షూటింగ్స్ దగ్గర నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు ఎవరైనా అడిగితే కజిన్ అనే చెప్పాను. ఇప్పుడు అతని మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ పెట్టాను. నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే ఇక్కడ ఉంటున్నాను’’అంటూ కన్నీళ్లు పెట్టుకుంది లాస్య