థియేటర్లు తెరుచుకున్నప్పటికీ రిలీజ్ కి సినిమాలు మాత్రం లేవు. దీంతో ఇదివరకే రిలీజైన సినిమాలను మరోసారి ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. బెంగుళూరు, చెన్నై లాంటి సిటీలలో తమ భాషకి సంబంధించిన సినిమాలతో పాటు తెలుగులో హిట్ అయిన ‘అల.. వైకుంఠపురములో’, ‘భీష్మ’ లాంటి సినిమాలను ప్రదర్శిస్తున్నారు.