ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లాక్ డౌన్కి ముందు 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు మళ్లీ షూటింగులకు సమాయాత్తం అవుతోంది. దసరా తరవాత వకీల్ సాబ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కాబోతోంది. ఈ షెడ్యూల్ లో పవన్, శ్రుతిపై కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ పాటని తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ తోనే షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. ఇందుకోసం ఆర్.ఎఫ్.సీ లో ఓ సెట్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.