రామరాజు ఫర్ భీమ్ పేరుతో విడుదల కాబోతున్న వీడియోలో ఎన్టీఆర్ ను పలు గెటప్ లలో రాజమౌళి చూపించబోతున్నారట. ఓ మామూలు మనిషి నుంచి ఉద్యమకారుడైన కొమరం భీమ్ గా మారిన వైనం చూపెట్టబోతున్నారు. అయితే ఈ స్టోరీనంతా చకచకా రకరకాల వేషాల్లో చూపిస్తారని తెలుస్తోంది. చివరిగా తలకు పాగా చుట్టుకున్న ఎన్టీఆర్ గెటప్ తో టీజర్ ముగుస్తుందట. టీజర్ మొదట్లో లాల్చీ తో కనిపించే ఎన్టీఆర్, టీజర్ చివర్లో తలపాగా చుట్టుకుని అలరిస్తారు. ఈ గెటప్ లు అన్నీ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకునేలా కట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఈసారి ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చే లేటెస్ట్ కంటెంట్ మరింత సెన్సేషన్ కావడం మాత్రం ఖాయం.