బెంగళూరు అమ్మాయిలు తాము డేరింగ్ అండ్ డాషింగ్ అని మరోసారి నిరూపించుకున్నారు. అందరూ భయంతో వెనకడుగేస్తున్న వేళ, తాము మాత్రం ధైర్యంగా ముందడుగేశారు. అన్ లాక్ సడలింపుల్లో భాగంగా ఈనెల 15నుంచి థియేటర్లు ఓపెన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల కేవలం మల్టీప్లెక్స్ లు మాత్రం ఓపెన్ అయ్యాయి. అయినా కూడా ఎవరూ సినిమాలు చూడటానికి ముందుకు రాలేదు. ప్రేక్షకులు లేక థియేటర్ ఓనర్లు ఈగలు తోలుకుంటున్నారని తెలుస్తోంది.