అక్టోబర్ 17 కీర్తి సురేష్ పుట్టినరోజు. ఈ బర్త్డేతో 28 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది కీర్తి. ఇక ఈమె నటించిన'మహానటి' సినిమా కీర్తిపై బాధ్యతను పెంచింది. దాంతో ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ కీర్తి పేరును నిలబెట్టలేక పోయాయి. దాంతో వరుస పరాజయాలు పలకరించాయి. ఆచితూచి అడుగు వేయమని సూచించాయి.  ప్రస్తుతం కీర్తి తెలుగులో 'మిస్ ఇండియా', 'రంగ్ దే', ద్విభాషా చిత్రం 'గుడ్ లక్ సఖి'లతో పాటు మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట', మలయాళ మూవీ 'అరబిక్ కడలింటే సింహం', తమిళంలో 'అన్నాత్తై', 'సాని కాయిదం' చిత్రాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ఇలా బిజీ బిజీ హీరోయిన్గా మారిన కీర్తి.. రాబోయే ఈ చిత్రాలతో మునుపటి ఫామ్ అందిపుచ్చుకుని మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తూ...హ్యాపీ బర్త్ డే కీర్తి సురేష్....!!