శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమా విడుదల అనుకున్నదానికంటే మరింత ఆలస్యమవుతోంది. లెక్కప్రకారం ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికి కరోనా పరిస్థితులు ఇంకా తగ్గుముఖం పట్టవని, ప్రేక్షకులు థియేటర్లకు రారని అంచనా వేస్తున్నారు నిర్మాతలు. లవ్ స్టోరీ సినిమాను ఏకంగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసినట్టు వార్తలు వస్తున్నాయి.