తాజాగా ఆలీతో జాలీగా అనే ప్రోగ్రామ్లో పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు.అందులో వినాయక్.. దర్శకుడిగా తన ప్రస్థానంతో పాటు పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు.  దీంతో పాటు చిరంజీవి, బాలకృష్ణలతో తాను చేయబోయే సినిమాల గురించి ఓపెన్ అయ్యాడు. ఈ మధ్యనే తాను బాలయ్య కోసం ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేశానని.. త్వరలో దాన్ని బాలయ్యకు వినిపించబోతున్నానని చెప్పడంతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఎక్సయిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.