ప్రస్తుతం మహేష్.. ప్రస్తుతం పరశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ని అమెరికాలో ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. కానీ ఇప్పుడు షూటింగ్ కి వీసా సమస్య రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈలోపు త్రివిక్రమ్... మహేష్ తో సినిమా మొదలు పెట్టి జనవరి లోపు దాన్ని పూర్తి చేయాలని చేస్తున్నాడట.  అప్పటిదాకా ఎన్టీఆర్ తన RRR షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసి ఫ్రీ అయిపోతాడు..కాబట్టీ ఈ గ్యాప్ ని కవర్ చేయడానికి మహేష్ తో సినిమా మొదలుపెట్టి... దాన్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.