గత కొన్ని రోజులుగా అఖిల్, సోహైల్, మెహబూబ్ కలిసే ఉంటున్నారు. ప్రతి విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. అలాగే ఏదైనా జరిగితే ముగ్గురూ ఒకటైపోతున్నారు. అయితే రెండు రోజులుగా పరిస్థితి మారింది. మొన్నెప్పుడో మోనాల్ గురించి ఏదో అన్నాడని మెహబూబ్ విషయంలో అలిగాడు అఖిల్. అప్పుడు సోహైల్ సర్ది చెప్పాడు. నిన్న జరిగిన పుషప్స్ టాస్క్‌లో మెహబూబ్ ఏదో అన్నాడని మళ్లీ అలిగాడు. ‘నేను 60 పుషప్స్ తీసేలోగా అఖిల్ 101 కొట్టాడా’ అని మోహబూబ్ దివితో అన్నాడట. ఆ విషయం ఆమె అఖిల్ దగ్గర ఉంది. దీంతో హర్ట్ అయ్యాడట.