కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రారంభమైన సినిమాల్లో టక్ జగదీష్ ఒకటి. నాని హీరోగా సాహు గారపాటి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే అనుకోకుండా ఈ సినిమా షూట్ ఇప్పుడు మళ్లీ ఆగిపోయింది. యూనిట్ లో కీలకమైన టెక్నీషియన్లిద్దరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో సినిమా షూట్ ఆగిపోయినట్టు తెలుస్తోంది.