లావణ్య చేతికి ఉన్న ఉంగరం చూసిన ఓ నెటిజన్ ”అది నిశ్చితార్ధపు ఉంగరమా..?’ అని ప్రశ్నించాడు. దానికి లావణ్య త్రిపాఠి.. ”అమ్మాయిలు ఉంగరాలు పెట్టుకోకూడదా..? చేతికి ఉంగరం ఉంటే అది ఎంగేజ్మెంట్ రింగ్ అవుతుందా..? అది నా సొంత డబ్బులతో కొనుక్కున్న ఉంగరం. నాకు నేనిచ్చుకున్న గిఫ్ట్..” అంటూ రివర్స్ లో సమాధానమిచ్చింది. ఇక మరో నెటిజన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు అక్క..? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకి లావణ్య ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువై.. ”ఈ ప్రశ్న మా అమ్మానాన్నలే ఇంకా అడగలేదు. నీకెందుకు..?” అంటూ ఘాటుగా బదులిచ్చింది.ఇక నెటిజన్స్ ఏమన్నా మామూలోళ్ల ఏంటి ఆమె ఘాటు సమాధానాలకి విపరీతంగా అసభ్యకర కామెంట్స్ తో లావణ్య ని తెగ ట్రోల్ చేస్తున్నారు.