ఈనెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలనుంచి వచ్చే సర్ ప్రైజ్ ల గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆయన రియల్ లైఫ్ గురించి కూడా ఈ పుట్టినరోజున ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాది కచ్చితంగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వస్తుందని తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కృష్ణంరాజు ఈ విషయంపై క్లారిటీ ఇస్తారని అంటున్నారు.