పుల్లెల గోపీచంద్ బయోపిక్ ప్రవీణ్  తీస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి కానీ అది కూడా కుదరలేదు. ఇక అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ దర్శకత్వంలో ఒక సినిమాను అనౌన్స్ చేశారు. సెట్స్ మీదికి ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. ఇలా అతని ప్లాన్స్ అన్ని ప్రారంభం లోనే ఢమాల్ అయిపోయాయి.  కానీ రామ్, ప్రవీణ్ కాంబినేషన్లో ఇంతకుముందు సెట్ అయిన ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ బయటికి తీసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది