మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ బ్రహ్మండమైన స్టూడియోను నిర్మించబోతున్నారనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఆయనకు ఉన్న పదెకరాల స్థలంలో స్టూడియోను ప్రారంభించనున్నారు. ఇందులో నాలుగు ఫ్లోర్లు, కాటేజీలు కూడా నిర్మిస్తారని అంటున్నారు.  ఇండోర్ షూటింగ్స్, టీవీ సీరియల్స్, రియాలిటీ షోస్, మినీ ఈవెంట్స్.. జరపుకునే వీలుగా ఈ స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.అంతేకాదు ఈ స్టూడియో పూర్తి బాధ్యతలు చిరంజీవి దగ్గరుండి మరీ చూసుకుంటారని తెలుస్తోంది.