ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై భీబత్సమైన అంచనాలున్నాయి.ఇది ఎన్టీఆర్‌కు 30వ చిత్రం. అయితే ఈ చిత్రం గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో అరవింద సమేతను తీసిన త్రివిక్రమ్, ఈసారి చేయబోయే చిత్రానికి అమెరికా నేపథ్యం ఎంచుకున్నారట. కుటుంబ విలువలతో పాటు పాశ్చాత్య అంశాలకు చిత్రకథలో త్రివిక్రమ్ చోటు కల్పించారట.  ఇక వచ్చే ఏడాదే ఈ చిత్రం సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. మొత్తానికి ఎన్టీఆర్ 30వ సినిమా విషయంలో త్రివిక్రమ్ భారీ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.