రష్మిక తాజాగా క్రేజీ రికార్డ్‌ను అందుకుంది. అతి తక్కువ మంది హీరోయిన్స్ మాత్రమే దక్కించుకున్న కోటి మంది ఫాలోవర్స్ సంఖ్యను రష్మిక కూడా సొంతం చేసుకుంది. తాజాగా రష్మిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్ ల మార్క్ క్రాస్ అయింది. అయితే చాలా తక్కువ సమయంలోనే రష్మిక పది మిలియన్ల ఫాలోవర్స్‌ను వెనకేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళం, కన్నడంలో కూడా రష్మిక వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ భాషల్లో కూడా ఆమె ఎందరో అభిమానులు ఉన్నారు. అందుకే ఆమెకు ఈ స్థాయి ఫాలోవర్స్ దక్కారని అంటున్నారు. దీన్ని బట్టి టాలీవుడ్ లో రష్మీకకు ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టం అవుతోంది..