భారత దేశంలో విశేష ప్రజాదరణ పొందిన శీతలపానీయం ఫిజ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించారు. తాజాగా 'బీ ఫిజ్' పేరిట కొత్త ఉత్పత్తి వచ్చింది. ఈ ప్రొడక్ట్ కు సంబంధించిన సరికొత్త యాడ్ లో ఎన్టీఆర్ దర్శనమించి అందరినీ ఆకట్టుకున్నాడు.ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం స్లిమ్ గా మారిన ఎన్టీఆర్ ఈ యాడ్ లో మరింత ఉత్సాహంగా కనిపించారు.తనదైన శైలిలో స్టెప్పులు వేసి అలరించారు. `ఇంట్రడ్యూసింగ్ బీ ఫిజ్. బీ ద ఫిజ్` అంటూ డైలాగ్ చెప్పారు. తాజాగా ఈ బీ ఫిజ్ యాడ్‌ను ఎన్టీఆర్ పోస్ట్ చేస్తుంది.  ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియో లో ఎన్టీఆర్ లుక్స్ కి ఫిదా అవుతూ... ఆ వీడియో ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరోని సరికొత్త లుక్ లో చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.