యాంకర్ కత్తి కార్తీకపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. కార్తీక తనను మోసం చేసిందంటూ దొరస్వామి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దొరస్వామి అనే వ్యక్తి టచ్ స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ అనే సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా భారీ అపార్ట్మెంట్ ను నిర్మించాలని అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కత్తి కార్తీక.. మరో వ్యక్తి సహాయంతో దొరస్వామిని కలిసింది. అమీన్ పూర్ వద్ద ఎకరాల స్థలం ఉందని.. అందులో తనకు కూడా వాటా ఉందని నమ్మించింది.