టాలీవుడ్ లో గోపీచంద్, అనుష్క లది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ జంట కలయికలో వచ్చిన 'లక్ష్యం', 'శౌర్యం' చిత్రాలు కమర్షియల్ విజయాల్ని సాధించాయి.ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..గోపీచంద్ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో 'అలిమేలుమంగ వెంకటరమణ' పేరుతో ఓ చిత్రం తెరకెక్కనున్నది. కుటుంబవిలువలు, యాక్షన్ అంశాల కలబోతగా తేజ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. నాయిక పాత్రకు ప్రాముఖ్యమున్న కథ కావడంతో హీరోయిన్ కోసం చిత్రబృందం అన్వేషణ సాగిస్తోంది.  తొలుత ఈ సినిమాలో కీర్తిసురేష్, కాజల్ అగర్వాల్లలో ఒకరు కథానాయికగా నటించనున్నట్లు వార్తలొచ్చాయి.వారి డేట్స్ ఖాళీ లేకపోవడంతో చిత్రబృందం అనుష్క వైపు మొగ్గుచూపినట్లు తెలిసింది. కథానాయికగా ఆమెను తీసుకున్నట్లు చెబుతున్నారు.