ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్స్‌తో కలిసి మహేష్ ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.మూడున్నరేళ్లలో వెయ్యి మందికి పైగా చిన్నారులకు మహేష్ గుండె ఆపరేషన్స్ చేయించడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించారు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరో రెండు గుండెలు తమ కుటుంబంలో కలిశాయని నమ్రత తెలిపారు.  "మరో రెండు గుండెలు మా కుటుంబానికి తోడయ్యాయి. ఇటీవల గుండె ఆపరేషన్స్ చేయించుకున్న ఇద్దరు చిన్నారులు ఆరోగ్యం కుదుటపడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.ఆంధ్రా హాస్పిటల్స్‌కు ధన్యవాదాలు" అని నమ్రత పోస్ట్ పెట్టారు.