మీకు స్మార్ట్ ఫోన్ ఉందా. అయితే మీ ఫోన్ లో కచ్చితంగా ఈ యాప్ లు ఉండి తీరాల్సిందేనంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇటీవల మ్యూజింగ్స్ అంటూ తన ప్రసంగాలు వినిపిస్తున్న పూరీ.. తాజాగా యాప్ ల గురించి వివరించారు. మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారని అనుకుంటున్నారా? ఆ అనుమానమే మీకుంటే కచ్చితంగా ఈ యాప్ వాడండి అని సలహా ఇస్తున్నారు పూరీ. మీ ఫోన్ను ఎవరూ హ్యాక్ చేయకుండా రక్షించుకోవాలంటే ‘NERDVPN’ అనే యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని చెబుతున్నారు. ఈ యాప్ వాడితే.. ఎవరు ఎప్పుడు మన ఫోన్ తో కనెక్ట్ అవ్వాలని చూసినా వెంటనే మనకు తెలిసిపోతుందట. మంచి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న యాప్ ఇది అని చెబుతున్నారు.