మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ఓకే చేసిన చిరు.. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో ‘లూసిఫర్’ రీమేక్ కి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ రెండూ మాస్ సినిమాలే.. పైగా ఈ సినిమాలను డీల్ చేస్తోన్న దర్శకులపై కూడా ఆడియన్స్ లో నమ్మకం లేదు. ఈ రెండు సినిమాలు చాలవన్నట్లు మరో రీమేక్ పై చిరు దృష్టి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో హిట్ అయిన ‘ఎన్నై అరిందాల్’ సినిమాను తెలుగులో ‘ఎంతవాడు గానీ’ అనే టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ చేశారు.