ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. నవంబర్ మొదటివారంలో మొదలయ్యే షెడ్యూల్ లో పవన్ జాయిన్ అవుతారని తెలిసింది.నవంబర్ నుండి బ్రేకులు లేకుండా సినిమా కంప్లీట్ అయ్యేవరకు నాన్ స్టాప్ గా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశారట.డిసెంబర్ ఎండింగ్ కి సినిమా రెడీగా ఉండాలని టార్గెట్ కింద పెట్టుకున్నారట. పవన్ కూడా నాన్ స్టాప్ షెడ్యూల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని యూనిట్ వర్గాలు అంటున్నాయి.అసలైతే ఈ సినిమాను మే నెలలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు.  కానీ కరోనా వల్ల అది కుదరలేదు. అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను కుదిరితే సంక్రాంతికి లేదంటే వేసవికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట.