వనితా తన భర్త పీటర్, పిల్లలతో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లి వచ్చింది. అక్కడ వీరిద్దరూ తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. వనితా, పీటర్ ల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. గోవా ట్రిప్ లో పీటర్ ఎక్కువగా మద్యం సేవించి నానా గొడవ చేశాడట. అంతేకాదు.. వనితాతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కొట్టిందట. అక్కడ నుండి చెన్నైకి వచ్చిన తరువాత కూడా పీటర్ మద్యం మత్తులో ఉండడంతో అతడిని ఇంటి నుండి తరిమేసిందట వనిత.