నోయెల్ తన తల్లి ఇళ్లల్లో పని చేసేదని.. తండ్రి ఇస్త్రీ పని, కూలి పని ఇలా ఎన్నో చేస్తూ డబ్బులు సంపాదించేవాడని చెప్పాడు. నోయెల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామని గూగుల్ సెర్చ్ చేస్తే.. నోయెల్ తండ్రి సామ్యూల్ రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని రాసి ఉంది. దీంతో నోయెల్ సింపతీ కోసం అబద్దాలు చెప్పాడంటూ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ విషయంపై నోయెల్ తమ్ముడు జోయెల్ క్లారిటీ ఇచ్చాడు. తన అన్నపై కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వికీపీడియాలో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ని ఎడిట్ చేసుకోని .. దాన్ని తీసుకొని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు.