మెగాస్టార్ అల్లుడు నటిస్తున్న కొత్త సినిమా సూపర్ మచ్చి కి రిపేర్లు జరుగుతున్నాయట. పులివాసు తెచ్చిన స్క్రిప్ట్ కి గతంలోనే చిరంజీవి చాలా మార్పులు, చేర్పులు చేశారు. అయితే కరోనా తర్వాత ఈ సినిమా విడుదలవుతుంది కాబట్టి.. ఈ టైమ్ లో వచ్చిన మార్పులు, మారిన ప్రేక్షకుల ఇష్టాయిష్టాల ఆధారంగా కొన్ని మార్పులు చేయాలని చిరంజీవి సూచించారట. దానికి తగ్గట్టే.. ప్రతిరోజూ దర్శకుడు పులివాసు మెగా కాంపౌండ్ కి వెళ్లి చర్చలు జరిపి వస్తున్నారట. ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తే.. సినిమా బ్యాక్ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అవుతుంది.