నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ ని హీరోగా లాంఛ్ చేసేందుకు కథలు వింటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు యువ దర్శకులు కొత్త కథలతో సురేష్ ప్రొడక్షన్ ఆఫీస్ కి వెళ్లారట. ఈ రెండు కథల్లో ఏదో ఒకటి ఫైనల్ అవుతుందని అప్పుడు అభిరామ్ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. లాక్ డౌన్ వ్యవహారాలన్నీ సెట్ అయిపోయి.. సినిమా షూటింగ్ లు తిరిగి జోరందుకుంటే.. అదే సమయంలో అభిరామ్ సినిమా కూడా పట్టాలెక్కుతుందని అంటున్నారు.