ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాదే శ్యామ్ సినిమా సినిమాలో నటిస్తున్నాడు.  ప్రస్తుతం చిత్ర యూనిట్ ఇటలీ లో ఉంది. చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తున్నారు. వీరు యమ స్పీడ్ గా పని కానిచ్చేస్తున్నారు . ఇప్పటికే అక్కడ కొన్ని కీలక ప్రదేశాల్లో షూట్ జరుగుతున్న ఆన్ లొకేషన్ ఫొటోస్ మరియు షూట్ వీడియోస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా ఇటలీ వీధుల్లో చిన్నారులతో ప్రభాస్ ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌ని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.  అంతేకాదు.. ఇలా రోజూ ఏదో ఒక పిక్ పోస్ట్ చేయాలంటే ప్రభాస్‌కు ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లు పెడుతుండటం విశేషం.