ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై భీబత్సమైన అంచనాలున్నాయి. ఇది ఎన్టీఆర్కు 30వ చిత్రం. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంతను పరిశీలిస్తున్నట్టు, ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.అంతేకాదు త్రివిక్రమ్ సినిమా అంటే దానికి సమంత కచ్చితంగా ఒప్పుకుంటుంది అనే మాట ఇప్పుడు ఇండ్రస్టీ లో వినబడుతోంది.