ఒక క్రేజీ, భారీ చిత్రంలో పూజా హెగ్డే కు అవకాశం దక్కింది. ఆ సినిమా పేరు..బాలీవుడ్లో ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా, హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి రూపొందించబోయే కొత్త కామెడీ మూవీ సర్కస్. ఇంతకుముందు అతడితో 'సింబా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన రణ్వీర్ సింగ్ ఇందులో హీరోగా నటించనున్నాడు. అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఇంతకుముందు 'గోల్ మాల్' సిరీస్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రోహిత్.. ఇప్పుడు 'సర్కస్'ను కూడా కామెడీ ఫ్రాంఛైజీగా రూపొందించనున్నాడట. అంటే ఈ సిరీస్‌లో ఆ తర్వాత కూడా సినిమాలు వస్తాయన్నమాట. అదే నిజమైతే పూజా పంట పండినట్లే.చివరగా పూజా 'హౌస్ ఫుల్-4'లో నటించింది.