పాతకాలం నటి ట్రైన్ నుండి దట్టమైన పొగ బయటకొస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తం కమ్మేస్తున్న దృశ్యంతో ఉన్న పోస్టర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఈ పోస్టర్ కోసం ‘రాధేశ్యామ్’ టీమ్ ఎక్కువ కష్టపలేదని.. ఇదొక కాపీ పోస్టర్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ పోస్టర్ ఒరిజినల్ ఫోటోని బయటకి తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలానే ఇలాంటి పోస్టర్స్ ఇప్పటికే చాలా హాలీవుడ్ చిత్రాల్లో చూపించారని.. ‘హ్యారీ పోటర్’ సినిమాలో కూడా ఇలాంటి ఓ సీన్ ఉందని గుర్తుచేస్తున్నారు.