ఓ పౌరాణిక సినిమాను డైరెక్ట్ చేయాలనే కోరికతో అప్పట్లో ‘నర్తనశాల’ అనే సినిమాను మొదలుపెట్టారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాలో ఆయన అర్జునుడి వేషం వేశారు. ద్రౌపదిగా సౌందర్యని తీసుకోగా.. భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబులను తీసుకొని కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కానీ ఊహించని విధంగా సౌందర్య హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అలా ఆగిపోయిన సినిమాను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేశారు బాలకృష్ణ.