వచ్చే ఏడాది మహేష్ రెండు సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్‌ను ఫిల్ చేయడానికి మహేష్ సర్కారు వారి పాట సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడని సమాచారం.  2021లో సర్కారు వారి చిత్రం చేస్తూనే.. త్రివిక్రమ్ మూవీని కూడా చేయనున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే కనీసం ఆరు నెలల గ్యాప్‌లోనే మహేష్ రెండుసార్లు అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు..