ఈ నెల 22న 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ రాబోతోంది. దీని గురించి కొన్ని రోజులుగా కౌంట్‌డౌన్‌తో ఊరిస్తూ వస్తోంది ఆర్ఆర్ఆర్ టీం. రోజు రోజుకూ దానిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముందు డేట్ మాత్రమే చెప్పిన చిత్ర బృందం.. టీజర్ రిలీజ్ టైం కూడా వెల్లడించింది. గురువారం ఉదయం 11 గంటలకు ఆ టీజర్ రాబోతోంది.  ఇక టీజర్లో తారక్ ఎలా కనిపిస్తాడు.. చరణ్ వాయిస్ ఓవర్ ఎలా ఉంటుంది అనే విషయాల్లో ఆయా హీరోల అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు.రామరాజు టీజర్లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోగా.. తారక్ వాయిస్ ఓవర్ అదే స్థాయిలో ప్రశంసలందుకుంది. భీమ్ టీజర్లో తారక్ బీస్ట్ అవతార్‌లో కనిపిస్తాడని అంటున్నారు. చరణ్ వాయిస్ ఓవర్ కూడా వావ్ అనిపించేలా ఉంటుందని.. పవర్ ఫుల్ డైలాగ్స్ పడ్డాయని చెప్పుకుంటున్నారు.