విభిన్న కథలతో ఎప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం అందించే డైరెక్టర్ క్రిష్.పవన్ కళ్యాణ్ తో ఓ చారిత్రాత్మక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ 27 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరిగింది. ఔరంగజేబు కాలంనాటి కథతో క్రిష్ ఈ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కి చాలా గ్యాప్ రావడం తో ఈ లోపు క్రిష్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఒక ప్రాజెక్ట్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నవంబర్ కల్లా ముగించేసి ఓఅవాన్ తో డిసెంబర్ లో మొదలు పెట్టాలని యోచనలో ఉన్నట్టు టాక్.