కేజీఎఫ్ చాప్టర్ 2 లో హీరో రాకీ ఫ్యామిలీ లైఫ్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాకీ భార్య రీనాగా శ్రీనిథి శెట్టి కనిపించబోతోంది. ఫస్ట్ పార్ట్ లో రాకీ లవర్ గా కనిపించిన శ్రీనిధి, సెకండ్ పార్ట్ లో భార్యగా కనిపిస్తుందనమాట. వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ, పెళ్లి సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా ఉంటాయని చెబుతున్నారు. శ్రీనిధి శెట్టి పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్ చిత్ర యూనిట్ విడుదల చేసిన బర్త్ డే పోస్టర్ తో ఈ విషయం స్పష్టమవుతోంది.