ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో మోషన్ పోస్టర్ విడుదల కానుండగా..ఈ నెల 21న అంటే ఈ రోజే రాధేశ్యామ్ నుంచి మరో బిగ్ సర్ప్రైజ్ రాబోతుంది. హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. `హాయ్.. నేను రాధేశ్యామ్ సెట్లో ఉన్నాను.మీ కోసం పెద్ద సర్ప్రైజ్ రాబోతోంది. అప్పటివరకు వేచి ఉండండి` అంటూ షూటింగ్ స్పాట్లో తీసిన వీడియోను పోస్ట్ చేసింది.  దీంతో ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే మే బీ ఇది ప్రభాస్ లుక్ గురించైనా లేదా టీజర్ విడుదల గురించైనా అయ్యుండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. మరి అది ఏమై ఉంటుందో తెలియాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే..